Trump: అగ్రసైన్య అధికారి బ్రౌన్‌ను తప్పించిన ట్రంప్ 1 y ago
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా అగ్రసైన్య అధికారి జనరల్ చార్లెస్ బ్రౌన్‌ను పదవి నుంచి తొలగించి, ఆయన స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ డాన్ రాజిన్ కైన్‌ను నియమిస్తున్నట్టు ప్రకటించారు. బ్రౌన్ సేవలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, కైన్‌ను కొత్త జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్‌గా నామినేట్ చేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. బ్రౌన్ అమెరికా రక్షణ చరిత్రలో రెండవ ఆఫ్రో-అమెరికన్ అధికారి.